- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జవాన్ యాదయ్య భార్యకు గవర్నమెంట్ జాబ్, భూమి.. కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం
దిశ, డైనమిక్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన జవాన్ మల్లెపాకుల యాదయ్య 2013లో వీరమరణం పొందగా.. ఆయన భార్య సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం, ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి ప్రభుత్వం యాదయ్య కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం, కల్వకుర్తి పట్టణంలో 165 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. అప్పటి నుంచి జవాన్ యాదయ్య భార్య వచ్చే పెన్షన్‌తోనే పిల్లలను పోషించుకుంటూ వస్తోంది.
యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టర్‌తో మాట్లాడి ఉద్యోగం ఇప్పించారు. ఈ క్రమంలోనే యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూమి పాస్‌బుక్‌ను సీఎం జవాన్ భార్యకు అందజేశారు. కాగా, ఉగ్రవాదుల తూటాలకు బలైన తెలంగాణకు చెందిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.