Janagaon : అయోధ్య సరయూ నదిలో తెలంగాణ బాలిక గల్లంతు

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-30 08:37:55.0  )
Janagaon : అయోధ్య సరయూ నదిలో తెలంగాణ బాలిక గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య సరయూ నదిలో పడి బాలిక గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో గల్లంతైన బాలికను జనగామకు చెందిన తేజశ్రీగా గుర్తించారు. బాలిక ఆచూకీ కోసం రెస్క్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. అయోధ్య రాముడి దర్శనానికి జనగామకు చెందిన నాగరాజు కుటుంబం వెళ్లింది. నదిలో స్నానం చేస్తుండగా కుటుంబం గల్లంతైంది. కాగా నలుగురిని స్థానికులు రక్షించారు. బాలిక మాత్రం గల్లంతు అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story