BRS వైఫల్యాలపై T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

by Satheesh |   ( Updated:2023-06-02 06:19:54.0  )
BRS వైఫల్యాలపై T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన వైఫల్యాలను ఏ టూ జెడ్ ఆల్ఫాబెట్స్‌తో వివరిస్తూ బుధవారం బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆసరా పింఛన్లు కొత్తవి ఇవ్వలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

ఇతర రాష్ట్రాలు, పార్టీలు, దేశాలకు బ్లాక్‌మనీ సరఫరా జరిగిందని ఆరోపించారు. వర్షాల కారణంగా ఎదురైన పరిణామాలకు రైతులకు పంట నష్టపరిహారం అందించలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ధరణి ల్యాండ్ మాఫియా, ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోవడం వంటి వైఫల్యాలు బీఆర్ఎస్ పాలనలో ఎదురయ్యాయని దుయ్యబట్టారు.

మరోవైపు, రాష్ట్రంలోని హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్, ప్రభుత్వ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ చేయడంలోను ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని, 9 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శించారు.

అకాల వర్షాల కారణంగా కాళేశ్వరం మోటార్లు జలమయమయ్యాయని, మద్యం స్కామ్, మియాపూర్ ల్యాండ్ స్కామ్, నయీం కేసు, ఆస్తులు, ఓఆర్ఆర్ టోల్ టెండర్ సమస్య, పాలమూరు రంగారెడ్డి ఎల్‌ఐఎస్‌కు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రశ్నాపత్రం లీకేజీలు కూడా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పట్టపగలు అత్యాచారాలు జరిగే దౌర్భాగ్య పరిస్థితులు ఎదురుకావడం దారుణం అన్నారు. చిన్నపాటి వర్షం కురిసినా హైదరాబాద్ రోడ్లు నీట మునిగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కుంటున్నారని మండిపడ్డారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎప్పుడో అటకెక్కిందంటూ సెటైర్లు వేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీలు ఇచ్చి.. నెరవేర్చలేదని బండి సంజయ్ గుర్తు చేశారు. ఇంధన ధరలపై వ్యాట్ దోపిడీ, వాటర్ బాడీలు ఆక్రమణ, ఎక్స్ రే ఆరోగ్యశ్రీ రీయింబర్స్‌మెంట్ స్కామ్, యాదాద్రి భూములు రియల్ ఎస్టేట్ వంటి ఎన్నో వైఫల్యాలు బీఆర్ఎస్ పాలనలో నెలకొన్నాయని, ఉద్యోగుల కుటుంబాలను జోనల్ వ్యవస్థ వేధిస్తున్నది అని బండి సంజయ్ బీఆర్ఎస్ వైఫల్యాలను ఆల్ఫాబెట్స్‌తో వరుసగా పేర్కొన్నారు.

Also Read..

ఏ ఒక్కరో చేరనంత మాత్రాన బీజేపీ నష్టం జరగదు: మంత్రి కిషన్ రెడ్డి

బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం: బండి సంజయ్

Advertisement

Next Story