MD Sajjanar : మరణించిన తర్వాత జీవించడం! టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-09-19 15:53:49.0  )
MD Sajjanar : మరణించిన తర్వాత జీవించడం! టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుమారుడు కళ్లముందు లేకపోయినా.. అతని అవయవాలు దానం చేసి ఇతరులకు బతుకునివ్వాలనుకొని ఓ తల్లి గొప్ప మనసు చాటుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఇంద్రానగర్‌కు చెందిన మురహరి దేవదాస్ ప్రసాద్-సుజాత దంపతుల కుమారుడు శ్రావణ్‌ కుమార్ బేగంపేటలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల16న కేపీహెచ్‌బీ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. దీంతో అతని అవయవాలు దానం చేయాలని తల్లి, కుటుంబసభ్యులు నిర్ణయించుకుని జీవన్‌దాన్ ట్రస్ట్‌కు సమాచారం ఇవ్వగా మినిస్టర్ రోడ్డులోని కిమ్స్‌లో శ్రావణ్ కుమార్ లివర్, కిడ్నీలు, లంగ్స్ దానం చేశారు.

ఈ ఘటనపై గురువారం ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్ చేశారు. మరణించిన తర్వాత జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం అంటూ పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అమూల్య అవయవాలను అవసరమైన వారికి అందించగలిగితే ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు పరచుకుంటాయన్నారు. పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి అవయవాలను దానం చేసి.. ముగ్గురికి పునర్జన్మను ప్రసాదించిన శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులది గొప్ప మనుసు.. అని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

Read More..

21 ఏళ్లు వచ్చాయంటే అవయవదానం చేయాల్సిందే... రూల్ అమలు...

Advertisement

Next Story

Most Viewed