ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ : తెలంగాణలో అధికారం ఆ పార్టీదే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-01 15:07:50.0  )
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ :  తెలంగాణలో అధికారం ఆ పార్టీదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోలింగ్ గురువారం ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ రానున్నదనే చర్చ జోరందుకుంది. ఇక ఇప్పటికే పలు సర్వే సంస్థలు కాంగ్రెస్‌వైపే తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నాయి. తాజాగా శుక్రవారం ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో వెల్లడించింది. నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు ఉన్నట్లు స్పష్టం చేశాయి. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ : 63-73

బీఆర్ఎస్ : 34-44

బీజేపీ 4-8

ఇతరులు : 5-8 స్థానాలు గెలుచుకుంటాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed