INC: చీకటి కోణాలు బయటపడతాయని డ్రామాలు.. బీఆర్ఎస్ నేతలపై బల్మూర్ వెంకట్ ఫైర్

by Ramesh Goud |
INC: చీకటి కోణాలు బయటపడతాయని డ్రామాలు.. బీఆర్ఎస్ నేతలపై బల్మూర్ వెంకట్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చీకటి కోణాలు బయటపడతాయని బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్(Venkat Balmoor) అన్నారు. మంగళవారం గాంధీ భవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి(Kaushik Reddy Padi).. ఆంబోతులా తయారయ్యాడని, ఆయనను కానిస్టేబుల్ అడ్డుకున్నా.. సోషల్ మీడియాలో పెట్టుకుంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కౌశిక్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్లను వెన్నుపోటు పొడిచాడని, ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు వసూలు చేశాడని, ఆఖరికి ఆయన పీఏ(PA)ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు చేశారు.

అసలు డ్రగ్స్ టెస్ట్(Drugs Test) ఎక్కడ ఇయ్యాలో కూడా ఆయనకు తెలియదని, కొకైన్ తీసుకునే వాడితో సంబంధం ఏంటో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్(KTRBRS) బామ్మర్ది తప్పు చేయకపోతే.. మీ ఎమ్మెల్యే(BRS MLA's)లు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారని, కోర్టు(Court)కు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. చీకటి కోణాలు బయటపడతాయని డ్రామాలు ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మీటింగ్(Public Meetings) పెడితే కూడా అరెస్టులు చేశారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని, బీఆర్ఎస్ వాళ్లు ధర్నా చేసినా అనుమతి కూడా ఇస్తున్నామని ఎమ్మెల్సీ చెప్పారు.


Advertisement

Next Story