ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

by GSrikanth |
ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. మున్నేరు, లకారం చెరువులకు నీరు విడుదల చేయాలని శుక్రవారం అధికారులను ఆదేశించారు. పాలేరు జలాశయం నుంచి నీటి విడుదలకు అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం నగరవాసుల అవసరాల కోసమే నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా, నిన్న ఖమ్మం నియోజకవర్గ రైతుల కోసం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులు పంటలు వేసే సీజన్‌లో ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని తగిన సలహాలు, సూచనలు చేసేందుకు ‘రైతు నేస్తం’ దోహదపడుతుందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల మధ్య ప్రత్యక్ష, పరస్పర విషయ మార్పిడికి రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థతో జూమ్‌, యూట్యూబ్‌ లైవ్‌లో అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు అందించే రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story