తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు

by M.Rajitha |
తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గురువారం రాష్ట్రంలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసాయి. అయితే రానున్న మరో రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగ ఉండాలని హెచ్చరించింది.

Next Story

Most Viewed