గంజాయి విక్రయిస్తున్న ఐఐటీ విద్యార్థి అరెస్ట్

by M.Rajitha |
గంజాయి విక్రయిస్తున్న ఐఐటీ విద్యార్థి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో గంజాయి విక్రయిస్తున్న ఓ ఐఐటీ(IIT) విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ పీజీ హాస్టల్లో ఉంటూ ఐఐటీ చదువుతున్న పవన్ అనే విద్యార్థి గంజాయి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేయగా.. పవన్ ఉంటున్న హాస్టల్ గదిలో 1.5 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు పవన్ ను అరెస్ట్ చేశారు. పవన్ తో సంబంధం ఉన్న మణికొండ నివాసి అయిన లోకేష్ అనే ఐటీ ఉద్యోగిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి లోకేష్ కు 2.5 కిలోల గంజాయిని అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా పోలీసులు శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేశారు. నగరంలో గత కొంతకాలంగా గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ వినియోగం మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఓ విద్యార్థి గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో... మణికొండ, కూకట్ పల్లి ఎస్ఆర్ నగర్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి అరెస్టులు చేశారు.

Next Story

Most Viewed