- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత బెయిల్ పై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సహా అంత జైల్ లో ఊచలు లెక్క పెడుతున్నారని ఈ కేసులో కవిత నిర్దోషి అయితే ఆమెకు బెయిల్ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఇక్కడ దోచుకుంది చాలక ఢిల్లీ వెళ్లి దోచుకోవాలని చూసిందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, ఓవైసి ఇద్దరూ ఔరంగజేబు స్కూల్ కు చెందిన వారేనని సెటైర్ వేశారు. కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇచ్చి చూడండి అంటాడు, అసదుద్దీన్ ఓవైసీ గోవులను కోసుకుతినండి అని మాట్లాడుతున్నాడు అక్బర్, అసద్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీకి ముందు పదేళ్లు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీనే పాలించిందని అప్పుడు మహిళ బిల్లు ఎందుకు పెట్టలేదు? ఆ సమయంలో రాహుల్, ఒవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని మా మహిళ నేత ఓడించిందని హైదరాబాద్ లో ఓవైసీ కూడా మా పార్టీకి చెందిన మహిళ చేతిలో ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తెలంగాణలో హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని
మహిళల పట్ల మీ అభిప్రాయం ఏంటో ఓవైసీ, రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. కర్ణాటకలో సొంత పార్టీ కార్పొరేటర్ బిడ్డకు న్యాయం చేయలేని రాహుల్ గాంధీ ప్రపంచమంతా న్యాయ్ యాత్ర అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు మీ పార్టీ వాళ్ళకే న్యాయం చెయ్యలేని మీరు ప్రజలకు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హిందూ మహిళల మీద దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉందే తప్ప చర్యలు తీసుకోదని ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని అనేక అవినీతి చేసిన వారి చేతిలో దేశం భద్రంగా ఉంటుందా? అని నిలదీశారు. కాంగ్రెస్ అంబేద్కర్ కి భారత రత్న కూడా ఇవ్వకుండా అవమానించిందని సర్దార్ పటేల్ కు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్ జంధ్యం ధరించి గుడికి వెళ్తారు.. మిగతా సమయాల్లో ఎలా ఉంటారో, ఏం తింటారో అందరికీ తెలుసన్నారు. వయనాడ్ లో రాహుల్ ఓడిపోతున్నాడన్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లలో గెలవడానికే తిప్పలు పడుతోందని 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కంటే పదేళ్ళలో మోడీ ఎక్కువే అభివృద్ధి చేశారన్నారు. ఇందిర హయాంలో దూరదర్శన్ బ్లాక్ అండ్ వైట్ ఉండేదని ఇప్పుడు కలర్ లోకి మార్చాశాం అంతే అన్నారు. సర్జికల్ స్ట్రైక్ పై ప్రతిపక్షాలు మెచ్చుకోవడం మాని ప్రశ్నిస్తున్నాయని అసలు విపక్షాలు భారత్ పక్షాన ఉన్నాయా? లేదా ఇతర దేశాల పక్షాన ఉన్నాయా? అనేది సందేహం కలుగుతోందన్నారు. కచ్చా దీవులను శ్రీలంక కి అప్పజెపిన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.