- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐఏఎస్ ఆఫీసర్‌కే భద్రత లేదు.. ఇదేనా తెలంగాణ మోడల్: రేవంత్ రెడ్డి
X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ డిప్యూటీ తహశీల్దార్, ఐఏఎస్ ఆఫిసర్ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని ఆమె సిబ్బంది అడ్డుకున్న పోలీసులు అప్పగించారు. అనంతరం స్మితా సబర్వాల్ ఫిర్యాదుతో పోలీసులు డిప్యూటీ తహశీల్దార్ ను, అతని స్నేహితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. రేవంత్ తన ట్వీట్‌లో..కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నాం. ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త! అని తన ట్వీట్‌లో పేర్కోన్నారు.
Advertisement
Next Story