అనారోగ్యం పాలైన భార్య..మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయిన భర్త...చివరికి ఏమైందంటే..?

by Naveena |   ( Updated:2024-12-24 13:34:29.0  )
అనారోగ్యం పాలైన భార్య..మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయిన భర్త...చివరికి ఏమైందంటే..?
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ఓ దారుణం చోటు చేసుకుంది. కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త కష్టకాలంలో మొహం చాటేశాడు. అనారోగ్యంతో ఉన్న భార్యను రుద్రుర్ నుంచి తెచ్చి బాన్సువాడలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో భార్య, భర్త వస్తాడని ఎదురు చూస్తు రోజులు గడుపుతుంది. రుద్రుర్ చెందిన జ్యోతి(26) అనారోగ్యంతో కారణంగా భర్తతో కలిసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలో భర్త తన మూడు నెలల బాబును తీసుకుని..మళ్లీ వస్తానని చెప్పి భార్యను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో భార్య గత ఆరు రోజుల నుంచి భర్త కోసం చలిలో బిక్కుబిక్కు మంటూ నిస్సహాయంగా ఎదురు చూస్తుంది. జ్యోతి పరిస్థితిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. తన భర్త బిచ్కుందలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేస్తాడని, మూడు నెలల తన బాబును తీసుకెళ్ళి వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదని జ్యోతి వాపోయింది. ఆమె తెలిపిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే లేపకుండా స్విచ్ ఆఫ్ చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మానవత్వం చూపుతున్న ప్రజలు ఆమెకు ఆహారాన్ని అందిస్తూ ఆదుకుంటున్నారు. కానీ వస్తానని భరోసా ఇచ్చి వెళ్లిన..కట్టుకున్న భర్త రాకపోవడంతో జ్యోతి తల్లడిల్లిపోతుంది. ఎవరైనా భర్తను వెతికి పెట్టి తనకు సాయం చేయాలని వేడుకుంటుంది. మీడియా మిత్రులు 108 అంబులెన్సు కు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పించారు.

Advertisement

Next Story

Most Viewed