వైజాగ్ నుంచి నేను.. అక్కడి నుంచి బాబు మోహన్ పోటీ చేస్తున్నాం : కేఏపాల్

by Ramesh N |
వైజాగ్ నుంచి నేను.. అక్కడి నుంచి బాబు మోహన్ పోటీ చేస్తున్నాం : కేఏపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైజాగ్ నుంచి నేను.. వరంగల్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన బాబు మోహన్ పోటీ చేస్తున్నామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ వెల్లడించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని కేఏ పాల్ స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మార్పుపై బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనను గత ఐదేళ్లుగా వెట్టిచాకిరి చేయించుకుని వాడుకున్నారని ఆరోపించారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామన్న బీజేపీ నేత లక్ష్మణ్ లిస్టులో తన పేరు లేకుండా కేంద్రానికి పంపారని తెలిపారు. దేశం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కేఏపాల్ తో కలిసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కేఏపాల్ నేతృత్వంలో పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల్ సేవలు దేశానికి, రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశాన్ని అప్పుల ఊబిలో ఉంచారని బాబు మోహన్ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story