హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్న : మంత్రి జూపల్లి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-19 09:19:04.0  )
హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్న : మంత్రి జూపల్లి
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా అని సవాల్ విసురుతుండని, హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్నానని, హారేష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు..నేను చర్చకు వస్తానని ఎక్సైజ్ శాఖామంత్రి జుపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చడానికి హరీష్ రావు, కేటీఆర్ లు మాట్లాడుతున్నారన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ లో లక్షా యాభై వేల కోట్ల దోపిడి జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీష్ రావు లు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావులే నీతి మంతులం అంటున్నారని, వాళ్లే నిజాయితీగా పాలన అందిస్తాం అంటున్నారని, ఇస్టమన్ కలర్ లాగా బావ బామ్మర్దుల తీరు ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణను మొత్తం దోచుకుంది వాళ్లేనని, రాజకీయంగా దివాలా తీసిండ్రు కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర ఆదాయం ఎంత?అవినీతి ఎంత? అప్పు ఎంత?ఏవరెవరు ఎంత దోచుకున్నారు చర్చ చేద్దామని సవాల్ చేశారు. లాల్ బహుదూర్ స్టేడియంలో మీడియా సమక్షంలో 50 వేల ప్రజలు చూసే విధంగా చర్చ చేద్దామని జూపల్లి అన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నయని, నేను మీ అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడతడు అంటున్నాడని, కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కాకుండా హరీష్ రావు మంత్రి అయి డాన్స్ వేసిండని వ్యంగ్యాస్త్రాలు వేశారు. పది నెలలు అయినా ఇంకా ఓటమిని వాళ్ళు అంగరీకరించినట్లు కనపడట్లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 లో మూసీ పరివాహకం నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో నెంబర్ 7జారీ చేసిన సంగతి మరువరాదన్నారు. 50 మీటర్ల బఫర్ జోన్ లో నా ఇల్లు కూడా పోతుందని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ కావాల్సిందేనని, మురికి కూపం నుండి పేదలకు విముక్తి కలిపించాల్సిందేనన్నారు. కేసీఆర్ హైదరాబాద్ ను డల్లాస్, లండన్, ఇస్తాంబుల్ చేస్తా అన్నాడన్నారు. హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు తాగేట్లు చేస్తా అన్నాడని, హైదరాబాద్ ను మార్చాలని గతంలో కేసీఆర్ మాటలను మేము స్వాగతిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed