జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల స్థలాలు కొనే వారికి హైడ్రా కీలక సూచన

by Mahesh |
జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల స్థలాలు కొనే వారికి హైడ్రా కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైడ్రా పెను సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. దీంతో తమ జిల్లాల్లో కూడా హైడ్రా వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇంతటి పేరు తెచ్చుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చి వేయబోమని ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఆదివారం విడుదల చేశారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చ బోమని.. ఎఫ్‌టీఎల్, బఫర్‌‌జోన్‌లో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఆయన వివరణ ఇస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లు, ఇళ్ల స్థలాలు కొనాలనుకునే వారికి కీలక సూచనలు చేశారు. ప్రజలు, చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇండ్లను. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయ వద్దని సూచించారు. ప్రజలు తాము కొనాలనుకునే ఇంటి పేపర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని,, అక్రమ నిర్మాణాలను అస్సలే కొనుగోలు చేయోద్దని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed