Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

by Hamsa |
Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) గత ఏడాది ‘బేబీ’(baby) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రజెంట్ ఆనంద్, మిథున్ వరదరాజు(Mithun Varadaraju) దర్శకత్వంలో ‘డ్యూయెట్’(duet) అనే మూవీ చేస్తున్నాడు. అయితే దీనిని తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా(KE Gnanavel Raja) స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీనికి మధుర శ్రీధర్ రెడ్డి(Mathura Sridhar Reddy) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో.. నేడు రిటికా నాయక్(Ritika Nayak ) పుట్టినరోజు కావడంతో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో పెళ్లి కూతురు గెటప్‌లో రిటికా(Ritika Nayak ) ఉండగా.. బీచ్ పక్కన కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించింది. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ అమ్మడు ఇషా పాత్రలో నటిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే ప్రజెంట్ రిటికా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ సినీ ప్రియులను ఫిదా చేస్తోంది.

Advertisement

Next Story