భారీగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా

by M.Rajitha |
భారీగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
X

దిశ, వెబ్ డెస్క్ : హెచ్ఎండీఏ(HMDA) పరిధిలోని మూడు కీలక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి, 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా(HYDRA) ఆదివారం ప్రకటించింది. ఆదివారం ఉదయం నుండే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. కూకట్ పల్లి నల్లచెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ ప్రాంతాల్లో ఆక్రమణల కూల్చివేతలు చేపట్టింది.

కూకట్ పల్లిలోని నల్లచెరువులో సర్వే నంబర్ 66, 67, 68, 69 లోని వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చివేసి 4 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. కిష్టారెడ్డిపేటలో సర్వే నంబరు 164 లోని 3 భవనాలను, ఒక ఐదు అంతస్తుల వాణిజ్య భవనాన్ని కూల్చి వేసి ఒక ఎకరం ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పటేల్ గూడలోని సర్వే నంబర్ 12/2, 12/3 లోని 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, ప్రభుత్వానికి చెందిన 3 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed