- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hydra: ఇయర్ ఎండింగ్‌లో రోజు కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా
దిశ, వెబ్‌డెస్క్: ఇయర్ ఎండింగ్‌లో వరుస కూల్చివేతలతో హైడ్రా(Hydra) అధికారులు అందరినీ హడలెత్తిస్తున్నారు. కూల్చివేతల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఖాజాగూడ(Khajaguda)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో చివరకు ఎఫ్‌టీఎల్(FTL), బఫర్‌జోన్‌లోని 9.07 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు ప్రారంభించారు.
మొత్తంగా 20కి పైగా దుకాణాలను నేలమట్టం చేశారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు ఖాజాగూడలోని అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇటీవలే భగీరథమ్మ చెరువులోని ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చి ఆక్రమణలను కూల్చివేశారు.