Hyderabad: అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-19 10:02:42.0  )
Hyderabad: అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో హైడ్రా(Hydra) అధికారులు మరోసారి దూకుడు పెంచారు. గురువారం మణికొండ(Manikonda) సమీపంలోని అల్కాపురి టౌన్‌షిప్‌(Alkapuri Township)లో కూల్చివేతలు చేపట్టారు. ఉదయం రాగా అపార్ట్‌మెంట్‌(Raaga Apartment)లో షట్టర్లు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లు వేసి దుకాణాలు నిర్వహణ కొనసాగిస్తున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా(Hydra) కూల్చివేతలను రాగా అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఇదిలా ఉండగా.. గత నెల 27న మణికొండ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో షట్టర్లు తొలగించాలని ఆదేశించారు. నోటీసులకు స్పందించకపోవడంతో గురువారం కూల్చివేతలు చేశారు.

Advertisement

Next Story