- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తౌటోని కుంట చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా వాటిని పునరుద్ధరించడానికి సైతం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఔటరరింగురోడ్డుకు చేరువలోని నానక్‌రామ్‌గూడ చౌరస్తా ఖాజాగూడలోని తౌటోని కుంటను బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తౌటోని కుంట చెరువు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు.పరిసర ప్రాంతాల నుంచి చెరువుకు నీరు చేరే మార్గాల పరిశీలించారు. మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్డు యూనివర్సిటీ ఖాళీస్థలంలో వర్షపు నీరు నిలవడంతో ఆ దగ్గరలోని అపార్టుమెంట్ల సెల్లార్‌లలోకి నీరు వచ్చి చేరుతోందని స్థానికుల ఫిర్యాదు చేశారు.
దీంతోపాటు యూనివర్సిటీ ఖాళీ స్థలంలోంచి వరద నేరుగా తౌటోని కుంటకు చేరితే ఈ ఇబ్బంది ఉండదని స్థానికులు హైడ్రా కమిషనర్ కు వివరించారు. ఈ తరుణంలోనే యూనివర్సిటీ ఖాళీ స్థలంలోని వరద నీరు సులభంగా కాలువ ద్వారా తౌటోని కుంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. తౌటోని కుంట నిండితే ఆ నీరు నేరుగా భగీరధమ్మ చెరువుకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలంటూ అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు. నివాసాల మధ్య ఉన్న చెరువుల పునరుద్ధరణపై హైడ్రా దృష్టి పెట్టిందని.. ముందుగా వాటి ఎఫ్‌టీఎల్ నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు.
ట్రాఫిక్ సహాయకులుగా హైడ్రా వాలంటీర్లు
నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు బుధవారం హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు రంగంలోకి దిగారు. మొదటి విడతగా శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ వాలంటీర్లుగా విధులు నిర్వహించారు. ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలందించారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవలందించారు.