యూపీఎస్సీలో విజయానికి మానసికంగా సిద్ధం కావాలి

by Sridhar Babu |
యూపీఎస్సీలో విజయానికి మానసికంగా  సిద్ధం కావాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : యూపీఎస్సీ మెయిన్స్ లో విజయం సాధించడానికి మానసికంగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2023-24 సంవత్సరంలో 27 మంది అభ్యర్థులు ఫిలిమ్స్ ఎగ్జామినేషన్స్ లో క్వాలిఫై అయి 21 సెప్టెంబర్ 2024 రోజున నిర్వహించనున్న మెయిన్ పరీక్షకు హాజరవుతున్నారు.

ఈ అభ్యర్థులతో టీఎస్ ఎస్సీ స్టడీ సెంటర్లో జిల్లా కలెక్టర్ ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రిలిమ్స్ క్లియర్ చేసినందుకు అభ్యర్థులను అభినందించారు. వివిధ అంశాలపై అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టు విశ్లేషించి, ప్రశ్నలను అంచనా వేసి సిద్ధం చేసుకొని మంచి మార్కులు స్కోర్ చేయడానికి సబ్జెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి ప్రశ్నను రాయడానికి ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎస్సీ స్టడీ సెంటర్ హైదరాబాద్ డైరెక్టర్ ఏ. నరసింహారెడ్డి, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ సర్వయ్య, లైబ్రేరియన్ ఫిలిమ్స్ పాల్గొన్నారు.

Advertisement

Next Story