- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియామకాల్లో పారదర్శకత పాటించాలి
దిశ,సికింద్రాబాద్ : వైద్య శాఖలో చేపడుతున్న నియామకాల్లో పారదర్శకత పాటించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం గాంధీ మెడికల్ కాలేజ్ పరిపాలన భవనంలో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్ డాక్టర్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి హాజరై నియామకాల ప్రక్రియను పరిశీలించారు.
గాంధీ ఆసుపత్రిలో వివిధ కేటగిరీలలో పనిచేయడానికి మొత్తం 60 మందికి కాంటాక్ట్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 13వ తేదీన అభ్యంతరాల స్వీకరణ చేపట్టి, 14వ తేదీన నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్వ్యూలలో డీఎంఈ డాక్టర్ ఎన్.వాణి, గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఇందిర, సూపరింటెండెంట్ డాక్టర్ సీఎస్ఎన్ రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి శంకర్, డాక్టర్ వాలియా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.