- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరినీ కలిపా.. ఆ హామీలు నెరవేర్చుదాం.. నన్ను నమ్మండి: Revanth Reddy
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రులు చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధమన్నారు. ఎవరైనా విడగొట్టాలన్నా విడిపోని బంధమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఉండాలనేదే ఆ పార్టీ నేతల ఆలోచన అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకరికొకరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ విషయం ప్రజలందరికి అర్ధమైందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఛీడ, పీడ రెండు కూడా సీఎం కేసీఆరేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికి న్యాయం జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ డిక్లేషనర్‌లో కూడా ఈ అంశాన్ని చేర్చుతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. ‘జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం.. పేదలకు పంచుతాం. వాళ్ల మధ్యలో ఉన్న పంచాయితీలను తెంచుతాం. గిరిజనుల మధ్య ఉన్న పంచాయితీ.. దళితుల మధ్య ఉన్న వర్గీకరణ పంచాయితీలను పరిష్కరిస్తాం.’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.