నగరంలో కురిసిన వింత వర్షం..అవాక్కయిన స్థానికులు

by Aamani |
నగరంలో కురిసిన వింత వర్షం..అవాక్కయిన స్థానికులు
X

దిశ,కార్వాన్ : హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో వింత వర్షం కురిసింది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం నగరంలోని దట్టమైన మేఘం కమ్ముకుంది. అయితే ఆసిఫ్ నగర్ మురాద్ నగర్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆకాశంలో మేఘానికి చిల్లు పడినట్లుగా ఒక్కసారిగా నీళ్లు నేల మీద కురిసాయి. ఒక 6 ఫీట్ల మందమే వర్షం కురిసింది. ఈ వర్షం కురవడంతో స్థానికులు అందరూ వీడియోలు తీస్తూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి వింత వర్షం ఎప్పుడు చూడలేదని స్థానికులు వాపోయారు.

Advertisement

Next Story