- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర ఎంతో విశిష్టమైంది
దిశ, హైదరాబాద్ బ్యూరో : భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర ఎంతో విశిష్టమైనదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాల కృష్ణ గోఖలే,
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. స్వాతంత్య్ర సాధన కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందామన్నారు. హైదరాబాద్ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని 691 ప్రభుత్వ పాఠశాలలు, 253 ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం 88,547 విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడం జరుగుతోందని, ఎయిడెడ్ పాఠశాలల్లో 60 వేల విద్యార్థులకు మధ్యాహ్న
భోజనం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అర్హులైన 2,71,963 మందికి ఆసరా పెన్షన్ల కింద ప్రతినెలా రూ: 61,71,38,752 అందిస్తున్నామన్నారు. జిల్లాలో కల్యాణ లక్ష్మి పథకం కింద 1703 మందికి రూ: 17,04,97,548 ఇస్తున్నామని, షాదీ ముబారక్ పథకం కింద 5494 మందికి రూ: 55,00,37,304 విలువగల చెక్కులు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని 18.69 కోట్ల మంది వినియోగించుకున్నట్లు వివరించారు. ఇవేకాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలు సాధించిన ప్రగతిని, వాటి కింద పెడుతున్న ఖర్చులు, లబ్ధిదారుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.