Collector Anudeep Durishetti : మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్

by Sridhar Babu |
Collector Anudeep Durishetti : మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కొనియాడారు. మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడారని, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ )వెంకటాచారి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కదిరవన్, ఏవో సదానందం , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story