- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధం
దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. జీహెచ్ఎంసీలోని మూడున్నర వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్‌తో పాటు రెండున్నర వేల మంది ఔట్‌సోర్స్ సిబ్బందిని రేష్నలైజేషన్ చేసేందుకు కమిషనర్ ఆమ్రపాలి ఇటీవల నలుగురు అదనపు కమిషనర్లతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. పర్మినెంట్, ఔట్‌సోర్స్ ఎంప్లాయీస్ రేష్నలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు పలు సార్లు సమావేశమైన కమిటీ తుది సమావేశాన్ని బుధవారం నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 230 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులకు పదోన్నతులను కల్పించనున్నట్లు సమాచారం. అదనపు కమిషనర్ల కమిటీ తాజాగా సిద్ధం చేసిన జాబితాకు కమిషనర్ ఆమోదించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వారికి సీనియార్టీ ప్రకారం సీనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ పదోన్నతులకు అర్హులైన వారికి సూపరింటెండెంట్‌గా పదోన్నతులు కల్పించి బదిలీలు చేయనున్నట్లు సమాచారం.
రేషనలైజేషన్ పై ప్రత్యేక దృష్టి..
జీహెచ్ఎంసీలోని ప్రధాన కార్యాలయంతో పాటు జోన్, సర్కిళ్లలో పనిచేస్తున్న ఔట్‌సోర్స్ కంప్యూటర్ ఆపరేటర్ల రేష్నలైజేషన్ పైనే అదనపు కమిషనర్లతో నియమించిన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చాలా కాలంగా బదిలీల్లేని ఈ కంప్యూటర్ ఆపరేటర్లలో మూడేళ్లకు మంచి ఒకే చోట, ఒకే విభాగంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానచలనం కలిగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీల్లోనూ అదనపు కమిషనర్లతో నియమించిన కమిటీదే తుది నిర్ణయం కానున్నట్లు సమాచారం.