Bonalu: 'విశ్వవ్యాప్తమైన తెలంగాణ బోనాల.. 90 కోట్లు ఖర్చుతో ఉత్సవాలు'

by Manoj |   ( Updated:2022-07-01 10:57:53.0  )
Telangana Government is said to have Released 90 Crore for Bonalu Festivities, Says minister Talasani Srinivas Yadav
X

దిశ, చార్మినార్​: Telangana Government is said to have Released 90 Crore for Bonalu Festivities, Says minister Talasani Srinivas Yadav| తెలంగాణలో అత్యంతవైభవంగా జరిగే బోనాల ఉత్సవాలు విశ్వవ్యాప్తమయ్యాయని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలోనే కాక అమెరికా, లండన్​, దుబాయ్​, అస్ట్రేలియా లాంటి దేశాలలో కూడా బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. సాలార్​ జంగ్​ మ్యూజియంలో భాగ్యనగర్​ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్​ తివారి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పాత బస్తీ బోనాల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మాట్లాడుతూ.. భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ బోనాల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మొత్తం 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, ఇందులో వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం కింద 15 కోట్ల రూపాయలు, మరో 75 కోట్ల రూపాయలను బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో యావత్​ భారత దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 3500 ప్రైవేట్​ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందన్నారు. జూలై 17వ తేదీన సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపు, ప్రతిష్టాపన జరుగనుందని, జూలై 24 వ తేదీన బోనాల పండుగ, 25 వ తేదీన అమ్మవారి ఘటాల ఊరేగింపుతో బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలలోపే అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్​ వర్క్స్​ డీజీఎం కృష్ణ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed