గురుకుల రిక్రూట్‌‌‌లో 3 వేల పోస్టులను జత చేయాలి

by srinivas |   ( Updated:2023-04-06 16:03:39.0  )
గురుకుల రిక్రూట్‌‌‌లో 3 వేల పోస్టులను జత చేయాలి
X

- తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగ్‌లో ఉన్న 3 వేల గురుకుల పోస్టులకు కూడా త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రస్తుత గురుకుల రిక్రూట్‌మెంటుకు జత చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9096 ఖాళీలకు గత జూన్‌లో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి డిసెంబర్‌, జనవరిలో కలిపి 3 వేల పోస్టులకు అనుమతి ఇచ్చారని తెలిపారు. సంవత్సర కాలంగా పెండింగ్ పెట్టి నేడు 9231 పోస్టులకు గురుకుల నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన అన్ని ఖాళీలు గురుకుల ప్రకటనలో కలపాలని డిమాండ్ చేశారు. ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గురుకుల పరీక్షలకు 4 నుంచి 5 నెలల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. 12 వేల టీచర్ పోస్టులకు కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి త్వరగా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed