Telugu Desam Party : వరద బాధితులకు టీడీపీ ఆపన్న హస్తం

by Sridhar Babu |   ( Updated:2023-08-02 14:22:58.0  )
Telugu Desam Party : వరద బాధితులకు టీడీపీ ఆపన్న హస్తం
X

దిశ, మెహిదీపట్నం : వరద బాధితులకు టీడీపీ ఆపన్న హస్తం అందిస్తుంది. టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేష్ బండారి, జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేష్ కాసాని, పార్టీ నేతలు శివరాజ్, సాయికృష్ణ, సాయి బండారి, మధుకర్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సత్వర సాయం చేశారు. ములుగు నియోజకవర్గంలోని కొండాయి, ప్రాజెక్టునగర్, మల్యాల, పస్ర గ్రామాలకు చెందిన

వందలాదిమంది వరద బాధితులతో పాటు భూపాలపల్లి నియోజకవర్గం లో వరదలతో అల్లాడుతున్న మురంచపల్లి గ్రామస్తులకు సత్వర సాయం కింద నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సత్తా చాటి నిర్ణయాత్మక శక్తిగా మారుతామని తెలిపారు. టీడీపీకి బ్రహ్మరథం పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed