- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక అధికారులు నెలలో పది పాఠశాలలు సందర్శించాలి
దిశ, హైదరాబాద్ బ్యూరో : ప్రత్యేక అధికారులు ప్రతి నెలలో పది పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డీఈఓ, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని అధికారులు పాఠశాలలను సందర్శించి గుర్తించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలను సందర్శించి నివేదికలు సమర్పించేందుకు నియమించిన ప్రత్యేక అధికారులు ప్రతివారం రెండుకు తగ్గకుండా, నెలలో పది పాఠశాలను సందర్శించాలని, తప్పనిసరిగా పాఠశాలల్లోని అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
రిజిస్టర్ అప్డేట్,ఎమ్ఎన్ఓ లు, కాంప్లెక్స్ హెచ్ఎంలు అందులో సంతకం చేశారా ? లేదా అని పరిశీలించాలని సూచించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల నాణ్యతను పరిశీలించాలని, ఎఫ్ ఎల్ ఎన్ చూడాలని అన్నారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు అనర్గళంగా చదవగలుగుతున్నారా లేదా అనేది పరిశీలించాలని, పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంటే నివేదికలో పేర్కొనాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మిగిలిపోయిన పెండింగ్ పనులను త్వరగా పూర్తయ్యలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరివన్ పి.వెంకటాచారి,లా ఆఫీసర్ వీరబ్రహ్మ చారి జిల్లా అధికారులు పెరిక యాదయ్య , ఆశన్న, ఆర్.కోటజీ, ఆర్. రోహిణి, పవన్ కుమార్, సీపీఓ డాక్టర్ సురేందర్, రమేష్,ఏవో సదానందం పాల్గొన్నారు.
ప్రజావాణికి 111 దరఖాస్తులు...
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 111 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులలో గృహ నిర్మాణ శాఖకు 89, పింఛన్లు 9, భూ సమస్యలు 6, ఇతరములు 7 ఉన్నాయని ఆయన వివరించారు.