- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ సేవలు
దిశ, చార్మినార్ : రాష్ట్రంలో సెట్విన్ సేవలను విస్తరింప చేయడానికి తన వంతు కృషి చేస్తానని సెట్విన్ సంస్థ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి అన్నారు. త్వరలోనే జహీరాబాద్, తాండూర్, వికారాబాద్, సంగారెడ్డి, జడ్చర్ల ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. మంగళవారం సెట్విన్ మోతి గల్లీ శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
కేంద్రంలోని బ్యూటీషియన్, కట్టింగ్ అండ్ టైలరింగ్, కంప్యూటర్, ఎయిర్ లైన్ టికెటింగ్, సెల్ ఫోన్ రిపేర్, కంప్యూటర్ హార్డ్ వేర్, ప్రింటింగ్ ప్రెస్ కేంద్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సెట్విన్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.