దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సేవకుడు సద్గురు సంత్‌ సేవాలాల్‌: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ

by Kalyani |
దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సేవకుడు సద్గురు సంత్‌ సేవాలాల్‌: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ
X

దిశ, మియాపూర్: దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సేవకుడు సద్గురు సంత్‌ సేవాలాల్‌ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్‌ 284 వ జయంతిని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు సేవాలాల్ మహరాజ్ అని, దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలు చేశారని, దేశం కోసం, హిందూ ధర్మం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు మోహన్, అశోక్, గంగారాం, జైపాల్, నడిగడ్డ తండా వాసులు స్వామి నాయక్, తిరుపతి నాయక్, లక్పతి నాయక్, సీతారాం నాయక్, దశరథ్ నాయక్, సుధాకర్, గోపి నాయక్, జితేందర్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story