- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 37 కోట్ల గంజాయి, డ్రగ్స్ కాల్చివేత..
దిశ,కార్వాన్ : దాడుల్లో పట్టుబడిన డ్రగ్స్, గంజాయిని ఎక్సైజ్ అధికారులు కాల్చివేశారు. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి అదేశాల పై రూ.37 కోట్ల విలువచేసి గంజాయి డ్రగ్స్ ను అధికారులు కాల్చివేశారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో చాల కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్‌ను, గంజాయిని డిస్పోజల్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిస్పోజల్‌తో పాటు గంజాయి, డ్రగ్స్ రవాణ, అమ్మకాలను అరికట్టడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
కాల్చివేసిన మొత్తం..
తెలంగాణలో 15 జిల్లాల్లో 1030 కేసుల్లో రూ. 37 కోట్ల విలువ చేసే గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చి వేసినట్లు తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, భద్రాది కొత్తగూడం జిల్లాల్లో భారీ మొత్తంలో గంజాయిని రికార్డు స్థాయిలో కాల్చివేశారు. అంతేకాకుండా 15 జి ల్లాల్లో 847 గంజాయి మొక్కలను, 24,690 కేజీల గంజాయిని, హషీష్ అయిల్ 172 కేజీలు, గంజాయి చాక్లెట్స్ 4 కేజీలు, ఓపిఎం, పాపిష్ట 155 కేజీలు, ఎండిఎంఎ 518 గ్రాములు, ఎల్‌ఎస్‌డి బ్లాట్స్ 326, ఎస్టేసీ పీల్స్ 97, కోకైన్ 6 కేజీలు, అల్పోజోలం 223 కేజీలు, డైజోపామ్ 106 కేజీలను దాహనం చేశారు.
జిల్లాల వారీగా..
అదిలాబాద్ లో 48 కేసుల్లో 1.02 కోట్లు, మెదక్ 26 కేసులు రూ.87 లక్షలు, నల్లగొండ 1 కేసు రూ. 11 లక్షలు, సూర్యపేట్ 15 కేసులు రూ. 21 లక్షలు, యాదాద్రి 9 కేసులు రూ. 2 లక్షలు, ఖమ్మం 237 కేసుల్లో 1.88 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం 164 కేసులు రూ.19.12 కోట్లు ,మల్కాజ్గిరి 79 కేసులు రూ.2.55 కోట్లు, హైద`రాబాద్ 206 కేసులు రూ. 2.10 కోట్లు, సికింద్రాబాద్ 91 కేసులు 2.27 కోట్లు, మహబూబాబాద్ 34 కేసులు రూ. 3.02 కోట్లు, సరూర్‌నగర్ 6 కేసులు రూ. 1.21 కోట్లు వరగంల్ రూరల్ 25 కేసులు రూ. 83 లక్షలు, జనగామ రెండు కేసులు రూ.43 వేలు, వరంగల్ అర్బన్ 33 కేసులు రూ.60 లక్షల గంజాయి, నిజామాబాద్ జి ల్లాలో 9 కేసుల్లో డ్రగ్స్‌ను ప్రభుత్వ ఆమోదంతో దహనం చేశారు.
మిగతా జిల్లాలో ఏర్పాట్లు
తెలంగాణ జి ల్లాలో 15 జి ల్లాలోని ఇప్పటికే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో పట్టు బడిన గంజాయి, డ్రగ్స్‌ను గత రెండు నెలల నుంచి డిస్పోజల్ చేస్తున్నారు. మిగిలిన జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయి, డ్రగ్స్‌ను డిస్పోజల్ చేయడానికి అవసరమైన ప్రీపరేషన్ జరుగుతుంది. ఇంకా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 750 గంజాయి మొక్కలు, 1750 కిలోల గంజాయి,160 కేజీల హషీష్ అయిల్, వంద గ్రాముల ఎండిఎంఎ, 90 ఎల్‌ఎస్‌డి బాస్ట్స్,150 కేజీల మేర అల్పోజోలం నిల్వగా ఉంది. వీటిని కూడ ఈ నెలలో డిస్పోజల్ అవకాశాలు ఉన్నాయనీ త్వరితగతిన వాటిని దహనం చేయిస్తామని తెలిపారు.