- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు
దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం లోని రాంనగర్ మణమ్మ గల్లీలో రోడ్డు పై అక్రమ నిర్మాణాలను హైడ్రాధికారులు కూల్చి వేస్తున్నారు. బస్తీలో ఓ యువతీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ బస్తీలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన బస్తీలో ఆక్రమణలపై విచారణ జరపాలని, స్థానికుల రికార్డులు పరిశీలించాలని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసిపి దేవేందర్ బస్తీలో రెవెన్యూ రికార్డుల ప్రకారం అందరి దస్తావేజులను పరిశీలించారు. నివేదికను హైడ్రా కమిషనర్ కు సమర్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం హైడ్రాధికారులు రామ్ నగర్ మణెమ్మ గల్లీలో రోడ్డుపై అక్రమంగా ఉన్న నిర్మాణాల కూల్చివేత చేపట్టారు.