రామోజీ రావు మరణం తీరని లోటు: ఈనాడు వయోధిక పాత్రికేయులు, ఉద్యోగులు

by Satheesh |
రామోజీ రావు మరణం తీరని లోటు: ఈనాడు వయోధిక పాత్రికేయులు, ఉద్యోగులు
X

దిశ, ఖైరతాబాద్: ఈనాడు సంస్థ చైర్మన్ రామోజీ రావు మరణం మాకు తీరని లోటని ఈనాడు వయోధికా పాత్రికేయులు, ఉద్యోగులు అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన రామోజీ రావు సంతాప సభ కార్యక్రమంలో పాల్గొని నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఈనాడు మాజీ పాత్రికేయులు చెన్నయ్య మాట్లాడుతూ.. రామోజీ రావు 88 సంవత్సరాల సంపూర్ణ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విజయాలను చూశారు.. ఈనాడు సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి, ఆయన అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. మాజీ పాత్రికేయులు వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనాడులో పనిచేసిన వారు చాలా సంస్థల్లో మంచి స్ధాయిలో ఉన్నారని.. రామోజీ రావు చాలా మంది పాత్రికేయులకు తయారు చేశారని అన్నారు. అయన అందరితో ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవారని, డిసిప్లేన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనలో ఒక మంచి కళాకారుడు కూడా ఉన్నాడని, తబలా కూడా వాయించేవారు అని గుర్తుచేశారు.

మాజీ పాత్రికేయులు జమున మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం ఈనాడు కార్యాలయానికి వెళ్ళినపుడు 3 వేలమందిలో రామోజీరావు నన్ను సెలెక్ట్ చేశారని.. నా ప్రతిభను చూసి మెచ్చుకున్నారని, బెస్ట్ జర్నలిస్టు అని సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. మా అందరిపై చూపించిన ప్రేమ, అభిమానం మర్చిపోలేమన్నారు. సూర్యుడుకి అస్తమయం లేదు అలాగే రామోజీ రావుకి కూడా లేదని భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ పాత్రికేయులు వల్లీశ్వర్ మాట్లాడుతూ.. వృత్తిని, వ్యాపారాన్ని కలిపేవారు కాదని, పాత్రికేయ స్వేచ్ఛ ఉండేదన్నారు. ఈనాడులో పనిచేస్తున్నాం అంటే సమాజంలో ఒక మంచి పేరు ఉండేదన్నారు. మాజీ పాత్రికేయులు దుర్గ రావు మాట్లాడుతూ.. చిన్న, పెద్దా అని తేడా లేకుండా ఉద్యోగలందరితో ఆప్యాయంగా ఉండేవారన్నారు. మాజీ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ.. ఈనాడు సక్సెస్‌కు కారణం ప్రతి పాఠకులకు ఉదయం 6 గంటలకల్లా పేపర్లు చేరేలా చూసేవారని, నూతన ఒరవడికి ముందుకు తీసుకెళ్లడంలో ఈనాడు ఫస్ట్ ఉండేదని అన్నారు. రామోజీ రావు అంటే క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. మాజీ పాత్రికేయులు శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఎప్పుడు నలుగురిని నవ్విస్తూ ఉండే తాను రామోజీ మరణంతో కన్నీరు పెట్టుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ పాత్రికేయులు సుందర్ సాయి , వేణుగోపాల్ , మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed