- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెరుగైన విద్యా బోధన తో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి : మంత్రి పొన్నం
దిశ, సికింద్రాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్య బోధన తో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. బుధవారం తార్నాక డివిజన్ లాలాపేట లోని బీసీ బాలికల వసతి గృహాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఇన్చార్జ్ ఆదం సంతోష్ కుమార్ తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థినిలను అందుతున్న భోజనం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 40 శాతం మేర డైట్ చార్జీలు పెంచిందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో కలిసి కూర్చొని ముచ్చటించారు. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. త్రాగునీరు సరిపోవడం లేదని విద్యార్థులు తెలపడంతో వెంటనే బోర్ ఏర్పాటు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తేవడం జరిగిందని గుణాత్మకమైన విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అద్దె భవనాలలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల అద్దెలను 50 శాతం మేరా చెల్లించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ తిరుపతి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు నర్సింహులు, కృష్ణమాచారి, వార్డెన్ స్వర్ణలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.