- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలకృష్ణ కాల్పుల ఘటన.. ఆమె అలా చేస్తుందనుకోలేదని పోసాని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐ జరపాలని అమిత్ షాకు ఫిర్యాదు చేయడం, సీఎం జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీజేఐకి లేఖ రాయడంతో పురంధేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కాల్పుల ఘటనపై పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. బాలకృష్ణను కాపాడింది ఆనాడు కేంద్రమంత్రిగా ఉన్న పురంధేశ్వరి అని ఆయన చెప్పారు. ‘‘ నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దర్ని రివాల్వర్‌తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. వాళ్ల గుండెల్లో బుల్లెట్లు దిగబడి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. లెక్క ప్రకారం బాలకృష్ణను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. గ్యారంటీగా కేంద్రమంత్రిగా ఉన్న పురంధేశ్వరి అదే చేయాలి. ఎందుకంటే ఆమె నిజాయితీ పరురాలు. దేశభక్తురాలు. ఉత్తమురాలు. పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. కాబట్టి బాలకృష్ణ రెండు చెంపలు వాయించి పురంధేశ్వరి తీసుకెళ్లి జైలులో వేయిస్తారేమోనని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. మా తమ్ముడికి పిచ్చి. వాడికి మెంటల్, వాడేం చేస్తాడో వాడికే తెలియదు. పిల్ల మనస్తత్వం, తెలియకుండానే కాల్పులు జరిపారని, అలాంటప్పుడు కేసులు ఎలా వేస్తారని నలుగురు ఫేమస్ డాక్టర్లతో పురంధేశ్వరి సర్టిఫికెట్ ఇప్పించారు. బాలకృష్ణ పిచ్చోడు, మెంటలోడు, మానసిక రోగి అని పురంధేశ్వరి పెద్ద డ్రామా చేశారు. దాంతో బాలకృష్ణ ఒక గంట కూడా పోలీస్ స్టేషన్‌లో ఉండలేదు. బాలకృష్ణను మంచి ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్లారు. అయ్యో బాలయ్యకు ఏమైందంటూ అందరూ అక్కడి వెళ్లారు. అక్కడ బాలయ్య మందు తాగుతూ కూర్చుకున్నారు. జామ్ జామ్ డ్యాన్సులు గురించి మీ అందరికి తెలుసు.’’ అని పోసాని మురళి ఆరోపణలు చేశారు.