డ్రగ్ పెడ్లర్లకు అడ్డాగా ఉస్మానియా యూనివర్సిటీ

by Sridhar Babu |
డ్రగ్ పెడ్లర్లకు అడ్డాగా ఉస్మానియా యూనివర్సిటీ
X

దిశ, సికింద్రాబాద్ : డ్రగ్ పెడ్లర్లకు అడ్డాగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వాతావరణం మారుతుందని ఓయూ జేఏసీ నాయకులు జోగు నరేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్ లోని పలు వ్యాపార డబ్బాల వల్ల డ్రగ్స్ వాడేవారికి క్యాంపస్ అడ్డాగా మారిందని ఆయన పేర్కొన్నారు. క్యాంపస్లో నడుస్తున్నవ్యాపార డబ్బాల్లో విచ్చలవిడిగా సిగరెట్ల అమ్మకంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఎక్కువగా బయట వ్యక్తులు చేరి సిగరెట్లు తాగడమే కాకుండా ఆ సిగరెట్లలో తమ వెంట తెచ్చుకున్న గాంజా నింపి సేవిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల క్యాంపస్ వాతావరణం పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉందని అన్నారు.

టెండర్ల పేరుతో చిరు వ్యాపారులకు అధికారులు అనుమతి ఇస్తుంటే, మరోపక్క అనధికారికంగా వ్యాపార డబ్బాలు ఏర్పాటు చేసుకుని సిగరెట్లు అమ్ముతూ క్యాంపస్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. క్యాంపస్లోని సి హాస్టల్ మెస్ వద్ద , హెల్త్ సెంటర్ ముందు ఏర్పాటుచేసిన డబ్బా లలో విచ్చలవిడిగా సిగరెట్లు అమ్ముతున్నారన్నారు. వీరికి యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రేజాఖాన్, ఎస్టేట్ సెల్ డైరెక్టర్ శ్రీనివాసరావు వారి వద్ద ముడుపులు తీసుకుంటూ తమ అండదండలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సిగరెట్ల కల్చర్ ఏంటని అయన ప్రశ్నించారు. యూనివర్సిటీ కల్చర్ పూర్తిగా దెబ్బ తీనక ముందే అధికారులు స్పందించాలన్నారు. తక్షణమే ఆ డబ్బాలను మూయించి, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed