ఉస్మానియా అంటే బ్రాండ్

by Sridhar Babu |
ఉస్మానియా అంటే బ్రాండ్
X

దిశ,కార్వాన్ : ఉస్మానియా అంటే బ్రాండ్, హైదరాబాద్ అంటే ఉస్మానియా...ఉస్మానియా అంటే హైదరాబాద్ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించనున్న బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ భవనాలకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...ఉస్మానియా అనేది బ్రాండ్ ,ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి చాలా ఫేమస్ అన్నారు. సంసారం ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందో విద్యా, వైద్య శాఖలు కూడా అంతే కాంప్లికేటెడ్ గా ఉంటాయన్నారు. ప్రభుత్వ డాక్టర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వంటి నిపుణులు బయట దొరకరన్నారు. కక్షతో ఏ ప్రభుత్వం డాక్టర్లను బదిలీలు చేయదన్నారు. ఉస్మానియా అస్పత్రిపై కోర్టుల్లో కేసులు ఉన్నా వాటిని గౌరవిస్తూనే నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరో రెండు నెలల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రభుత్వం 2 వేల కోట్లతో 31 ఎకరాల్లో గోషామహల్ లో అధునాతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నామన్నారు. వైద్యో నారాయణ హరి అని వైద్యులు దేవుళ్లతో సమానంగా గౌరవిస్తారన్నారు. విద్యార్థి దశలో మీరు సక్రమంగా చదువుకొని మంచి వైద్యులు కావాలని కోరారు. రూ. 121 కోట్లతో ఈ హాస్టల్ భవనాలను నిర్మించుకోనున్నట్టు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు అనేకమైన వింత రోగాలు , కిడ్నీ సంబంధిత , గుండె సంబంధిత, డయాలసిస్, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్యలు తీసుకోవాలన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్టలాడుతూ భవిష్యత్తులో మంచి వైద్యం అందించాలంటే విద్యార్థులు సక్రమంగా చదువుకోవాలన్నారు. ప్రభుత్వం వైద్యం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చిన్న వయస్సులో వస్తున్న రోగాలపై అవగాహన కల్పించి పరిష్కరించే విధంగా పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సమస్యలపై ఎత్తిన గొంతును అణచివేసే ధోరణిని చూశామని పేర్కొన్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉస్మానియ మెడికల్ కాలేజీలో బాయ్స్, గర్ల్స్, హాస్టల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, జామ్ బాగ్ కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ తోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story