సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి

by Sridhar Babu |
సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి
X

దిశ, బేగంపేట : ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లోని కరీం కాంపౌండ్ లో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తమ బస్తీలో డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

స్పందించిన ఆయన వెంటనే డ్రైనేజీ లైన్ లను చెక్ చేసుకోవాలని, రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తమకు నల్లాల ద్వారా వచ్చే నీరు కలుషితం అవుతుందని చెప్పగా సమస్యను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. బస్తీలో పలు చోట్ల స్ట్రీట్ లైట్ లు లేవని కాలనీవాసులు తెలపగా వెంటనే అవసరమైన చోట్ల లైట్ లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

గతంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తన దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారని, వాటిలో వాటర్ లైన్, డ్రైనేజీ లైన్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఈ కార్యక్రమంలో శానిటేషన్ డీ ఈ ధర్మారెడ్డి, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, జీహెచ్ఎంసీ ఏఈ శివరాం, ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, బస్తీ వాసులు లతీఫ్, జబ్బార్, బాలేష్ యాదవ్, రబ్బానీ, రహీం, జావీద్, సాదిక్, గణేష్, చందు, జనార్ధన్ ఉన్నారు.

Advertisement

Next Story