- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్స్ డైరెక్టర్‌ని తొలగించాలని నర్సుల ధర్నా
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని, ఇలాంటి డైరెక్టర్ మాకు వద్దు అంటూ నిమ్స్ నర్సులు విధులు బహిష్కరించి మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత కుమారి, నర్సింగ్ యూనియన్ జనరల్ సెక్రటరీ విజయ కుమారి తదితరులు మాట్లాడుతూ.. నిమ్స్‌లో విధి నిర్వహణలో నర్సులు పడరాని పాట్లు పడుతున్నట్లు తెలిపారు. ఇక్కడ లెక్క ప్రకారం 2300 నర్సులు పని చేయాల్సి ఉండగా కేవలం 800 మంది మాత్రమే పని చేస్తున్నట్లు తెలిపారు. రోగుల రద్ధీకి తగ్గట్లుగా సిబ్బంది లేకున్నా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తున్నప్పటికీ డైరెక్టర్ గుర్తించడం లేదన్నారు. ప్రధానంగా నిమ్స్ లో రెగ్యులర్ గా పనిచేసే 500 మంది నర్సింగ్ స్టాఫ్ పై తీవ్ర పని వత్తిడి ఉందన్నారు.
నిమ్స్‌లో పని చేసే నర్సింగ్ స్టాఫ్ సమస్యలు రిప్రజెంట్ చేయడానికి వెళ్తే డైరెక్టర్ కలిసేందుకు కూడా ఇష్టపడరని ఆరోపించారు. ఎవరైనా ముందుకు వచ్చి సమస్యలు చెబితే వారిని టార్గెట్ చేస్తూ మెమెలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ వార్డులో మంచాలు ఖాళీగా ఉంచి బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చూపడానికి జనరల్ వార్డ్‌కు పేషెంట్2లని షిఫ్ట్ చేస్తున్నారని, దీంతో అక్కడ పేషెంట్‌లకు కావాల్సిన సదుపాయాలు సరిగ్గా అందడం లేదన్నారు. అయినా డైరెక్టర్ పట్టించుకోవడం లేదని వాపోయారు. దీని కారణంగా రోగులు, సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. ఇప్పటివరకు చిన్న చిన్న కారణాలతో నర్సులకు ఇచ్చిన మెమోలు వెంటనే వెనక్కు తీసుకోవాలని, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరిండెంట్‌కి ప్రమోషన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.