- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో ఆ ఘనత టీడీపీదే: Chandrababu
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మతసామరస్యాన్ని కాపాడిన ఘనత టీడీపీదేనని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో సోమవారం ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కర్ఫ్యూ సిటీని వ్యాక్సిన్ తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్‌ను తయారు చేశామన్నారు. టీడీపీ పాలనకు ముందు, తరువాత హైదరాబాద్‌ను చూడాలని కోరారు. టీడీపీ పాలనలో 14 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా అమలు చేసినట్లు గుర్తు చేశారు.
హజ్ యాత్రకు ముస్లింలు వెళ్లాలంటే బొంబాయి వెళ్లాల్సి వచ్చేదని, టీడీపీ పాలనలో హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మించి ఇక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు డైరెక్ట్ ఫ్లైట్లు ఏర్పాటు చేశామన్నారు. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూల్స్, దుకాన్ మకాన్లు నిర్మాణం, షాదీఖానాలు ఏర్పాటు, మసీదులకు ఆర్థిక సహాయం వంటివి చేశామన్నారు. అన్ని మతాలను, కులాలను అభివృద్ధి చేసింది టీడీపీయే అన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి శాశ్వతమని, చరిత్ర ఉన్నంతవరకు చేసిన అభివృద్ధి నిలిచి ఉంటుందన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో మంచి పనులు చేసినవారికి అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలతో ముస్లింలు పవిత్రలవుతున్నారన్నారు. క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మికతల కలయికగా రంజాన్ మాసం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, రామ్మోహన్ రావు, బంటు వెంకటేశ్వర్లు, జ్యోత్స్న, అలీ మస్కతీ, రామనాథం, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, కనగల సాంబశివరావు, రవీంద్ర చారి, షేక్ బాబా ఖాదర్, సాయి తులసి, పొగాకు జయరామ్, అశోక్, గోపి, శ్రీపతి సతీష్, రవీందర్, కాసాని వీరేశ్, ఆరీఫ్, అజ్మీర రాజునాయక్, బండారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.