ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-08-19 09:42:03.0  )
ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, ముషీరాబాద్: ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టీల్ బ్రిడ్జిను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ పేరు మీద సచివాలయం నిర్మాణంతో పాటు ప్రపంచంలోని అత్యంత ఎత్తయినవి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1978లో నాయిని నర్సింహారెడ్డి గెలిచారని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తన ముద్ర వేశారన్నారు. నాయిని నర్సింహారెడ్డి కేసీఅర్ వెంట పెద్దన్నలా ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నరసింహారెడ్డి ఆత్మ శాంతిస్తుందని కేటీఆర్ ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో ఇది 36వ ఫలితం అని అన్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే.. సినిమాలు విడుదల అయినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది అని అన్నారు.

ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల సాకారం అయ్యిందని తెలిపారు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి.. అందుకే ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ట్యాంక్ బండ్‌ను తీర్చి దిద్దాం, లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే కులాలకు, మతాలకు అతీతంగా ఉండాలన్నారు. గతంలో కర్ఫ్యూలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవన్నారు. పొరపాటు చేస్తే హైదరాబాద్ వందేళ్లు వెనక్కి పోతుందని ఆయన అన్నారు. కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వారిని పట్టించుకోవద్దన్నారు. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించండి అని కోరారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జీపులో స్టీల్ బ్రిడ్జ్‌పై కేటీఆర్ ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, బేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హజ్ కమిటీ చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు.

Read More: సినిమా చూసేది బీఆర్ఎస్‌ నేతలే.. మంత్రి కేటీఆర్‌కు ఈటల స్ట్రాంగ్ కౌంటర్

టికెట్ దక్కేనా..? హరీష్ రావు, కవిత, KTR ఫాలోవర్స్‌లో టెన్షన్..!

Advertisement

Next Story

Most Viewed