- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిఫ్టులో నుంచి కింద పడి వ్యక్తి మృతి..
దిశ, కార్వాన్ః దురదృష్టవశాత్తు లిఫ్టులో నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. నాలుగో ఫ్లోర్ లో ఉన్న లిఫ్టు బటన్ ప్రెస్ చేయడంతో లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయింది. దీంతో ఓ వ్యక్తి లిఫ్ట్ లో పడి మృతి చెందిన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... ప్రియా కాలనీ గుడి మల్కాపూర్ లోని వకాస్ అపార్టుమెంట్ నివసించే సమీవుల్లా బైగ్(55) రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగి. నాల్గవ ఫ్లోర్లో 402 నెంబర్ గల ఇంటిలో కొంతకాలం నుంచి కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో పని నిమిత్తం సమీవుల్లా కిందికి వెళ్లేందుకు 4 వ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయడంతో లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయ్యి 4 ఫ్లోర్ నుంచి లిఫ్టు లో క్రింద పడి చనిపోయాడు. అయితే స్థానికులు వెంటనే స్థానిక ఓలివ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. లిఫ్ట్ రాకముందే, లిఫ్ట్ డోర్ ఎలా ఓపెన్ అయిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.