- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లవి మోడల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం
దిశ, వెబ్ డెస్క్: బోడుప్పల్లోని పల్లవి మోడల్ స్కూల్ లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లవి మోడల్ స్కూల్ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తై పదో ఏట అడుగుపెట్టిన సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ మోడలిస్టు, సామాజిక సేవకురాలు సుధా జైన్ మాట్లాడుతూ.. భారత్ లో పుట్టిన యోగాను ఈ రోజు ప్రపంచంలోని ప్రజలందరూ జరుపుకోవడం సంతోషకరమన్నారు. దీనంతటికీ ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని కొనియాడారు. యోగా వల్ల విద్యార్థులు శారీరకంగానే కాక మానిసికంగానూ ధృఢంగా తయారవుతారని అన్నారు.
విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ తనూజ మాట్లాడుతూ.. పాఠశాలను స్థాపించి పదేళ్లు అవుతోందని, ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పదేళ్లలో పాఠశాల అభివృద్ధికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. యోగా వల్ల పిల్లల్లో సత్ప్రవర్తన అలవడుతుందని, అందుకే ప్రతి క్లాస్ కు యోగాను నేర్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.