దర్జాగా ఫుట్‌పాత్‌ల కబ్జా.. పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు..

by Sumithra |
దర్జాగా ఫుట్‌పాత్‌ల కబ్జా.. పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు..
X

దిశ, కార్వాన్ : రోజురోజుకు పుట్‌ఫాత్‌ల ఆక్రమమణలు జోరందుకుంటున్నాయి. సాధారణ రోడ్లపైనే కాక వీఐపీ మూవ్‌మెంట్ ఉండే రోడ్ల పరిస్థితి అలాగే మారింది. లక్డీకాపూల్ నుండి మెహిదీపట్నం వైపు వెళ్లే మహవీర్ ఆసుపత్రి ఎదురుగా ఉండే టీఎన్జీఓ రంగారెడ్డి జిల్లా కార్యాలయం చుట్టూ ఆక్రమణలు పుట్టగొడుగుల్లా వెలిశాయి.

ఈ రూట్లో నిత్యం ఏదో ఒక సమయంలో వీఐపీ మూమెంట్ ఉంటుంది. సీఎం సహా ఇతర మంత్రులందరూ ఇదే దారిలో వెళ్తుంటారు. ఇక్కడ వెలిసిన వాణిజ్య సముదాయల ముందు పుట్ పాత్ లను సైతం ఆక్రమించారు. పుట్ ఫాత్ బిజినెస్ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్డుకు ఇరువైపులా వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, పుట్‌ఫాత్‌లు ఆక్రమణలకు గురవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ అంతరాయం ట్రాఫిక్ పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చినట్లవుతోంది. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పాదచారుల ఆందోళనలు అధికం కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇక సర్కిల్-12 టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా వారు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. పాదాచారులు అడుగు పెట్టడానికి చోటు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. గడచిన నెల రోజుల కాలంలో మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా మరో ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల మరొక ఘటనలో ఒక డ్రైవర్ మద్యాన్ని సేవించి నిలోఫర్ కేఫ్ వద్ద బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 12 మంది గాయాల పాలయ్యారు. పాదచారుల విషయంలో హైకోర్టు గతంలో సీరియస్ గా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది స్పందించి టీఎన్జీఓ రంగారెడ్డి జిల్లా కార్యాలయం వద్ద వెలసిన పుట్ పాత్ ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed