Vijay Devarakonda: నా పర్సనల్ అనుభవం .. ప్రేమ తప్పక పుడుతుంది.. రౌడీ బాయ్ కామెంట్స్ రష్మికతో లవ్ గురించేనా?

by Hamsa |
Vijay Devarakonda: నా పర్సనల్ అనుభవం .. ప్రేమ తప్పక పుడుతుంది.. రౌడీ బాయ్   కామెంట్స్ రష్మికతో లవ్ గురించేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రజెంట్ సినిమాలు చేస్తూనే మరోవైపు ‘సాహిబా’(Sahiba) అనే మ్యూజిక్ అల్బమ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనిని ‘హీరియే’(Hearie) సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మ్యూజిక్ కంపోజర్ సింగర్ జస్లీన్ రాయల్(Jasleen Royal) రూపొందించారు. అయితే ఇందులో విజయ్ సరసన రాధిక మదన్(Radhika Madan) హీరోయిన్‌గా నటించింది. రీసెంట్‌గా ఈ సాంగ్ విడుదల చేయగా యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను రాబడుతూ ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్ ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘ప్రేమ అనేది తప్పక పుడుతుంది అబ్బాయిలు. మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు కాబట్టి కాస్త టైమ్ ఇవ్వండి. అన్నిటికంటే ముందుగా పురుషులు ఎదగాలి. ఇదేం చెట్ట విషయం కాదు. మీరు కొంచెం సమయం ఇవ్వాలి దానికి. లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ అనుభవం. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం. ఏది డిసైడ్ చేసుకోలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏది ఫోర్స్‌గా చేయకండి’’అని చెప్పుకొచ్చాడు.

ప్రజెంట్ విజయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారంతా రష్మిక(Rashmika Mandana)తో లవ్ గురించే అన్నాడని చర్చించుకుంటున్నారు. అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరు అధికారికంగా స్పందించకపోవడంతో రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల రష్మిక దీపావళి పండుగను విజయ్ ఇంట్లోనే జరుపుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్ కూడా పెట్టడంతో ప్రేమ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఈ క్రమంలోనే విజయ్ ప్రేమపై కామెంట్స్ చేయడంతో వీరిద్దరు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని గుసగుసలాడుకుంటున్నారు. ఇక విజయ్ సినిమా విషయానికొస్తే.. ‘VD12’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

Advertisement

Next Story