ఫేస్ బుక్‌లో పరిచయమై.. యువకుడి నుంచి కోటి 20 లక్షలు కొట్టేసిన యువతి

by srinivas |   ( Updated:2024-11-19 07:26:14.0  )
ఫేస్ బుక్‌లో పరిచయమై.. యువకుడి నుంచి కోటి 20 లక్షలు కొట్టేసిన యువతి
X

దిశ, వెబ్ డెస్క్: ఫేస్ బుక్‌లో పరిచయమైన వ్యక్తిని కర్నూలు యువతి మోసం చేశారు. ఫేస్ చూపించకుండా యువకుడితో 10 ఏళ్లు స్నేహం చేసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి రూ. కోటి రూ. 20 లక్షలు తీసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగిలో జరిగింది. అదే గ్రామానికి చెందిన సాయిలుకు ఫేస్ బుక్‌లో యువతి పరిచయం అయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని ఐదేళ్ల వరకూ యువతి నమ్మించింది. ఆ తర్వాత కేన్సర్ వచ్చిందని చెప్పి యువకుడు సాయిలు వద్ద విడతల వారీగా డబ్బులు తీసుకుంది. యువకుడితో వేరే అమ్మాయితో పెళ్లి అయినా స్నేహాన్ని కంటిన్యూ చేసింది. అప్పుడు కూడా డబ్బులు తీసుకుంది. అయితే డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతోందని సాయిలు పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఫిర్యాదు చేశారు. డబ్బులు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందజేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed