బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి బిగ్ అలర్ట్

by srinivas |
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు వాతావరణ శాఖ(Meteorology Department) అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల 21న దక్షిణ అండమాన్‌(South Andaman)పై ఉపరితల ఆవర్తనం(Surface Periodicity) ఏర్పడుతుందని, 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం 25న వాయుగుండంగా బలపడనుందని, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అటు తమిళనాడులోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తెలిపారు. వర్షాలు పడే సమయంలో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షం పడే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించారు.

Advertisement

Next Story